పోలవరం పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సీఎం ఆదేశాలు
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం చంద్రబాబు అసంతృప్తి?
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం చంద్రబాబు అసంతృప్తి?
సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ప్రాజెక్టు పనులు వేగంగా, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగాలని అధికారులకు సీఎం సూచించారు. ముఖ్యంగా కీలక నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలవరం పూర్తి లక్ష్యంతో ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.