గ్రామస్తుల భద్రతకు ప్రాధాన్యం – సహాయ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు
అమరావతి, జనవరి 5:
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ చోటుచేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి Chandrababu Naidu స్పందించారు. ఈ ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం ఫోన్ ద్వారా సమీక్షించారు.
ఈ విషయమై మంత్రులు Atchannaidu, Vasanamshetti Subhash ముఖ్యమంత్రితో మాట్లాడి, ఇప్పటికే స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపామని, సహాయ చర్యలను ముమ్మరం చేసినట్లు వివరించారు.
గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే మంటలను వెంటనే అదుపులోకి తీసుకురావాలని, ప్రమాద ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు.
జిల్లా అధికారులు, ONGC ప్రతినిధులతో నిరంతర సమన్వయం కొనసాగించాలని మంత్రులు, అధికారులకు సీఎం ఆదేశించారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.